Success story

జీవితం చాలా బిజీ గా అయిపోయింది అని కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నాను.

Previous roles/Companies: ఆడిట్ మేనేజర్ , Ernst & Young

Previous roles/Companies: ఆడిట్ మేనేజర్ , Ernst & Young

Some fun or nostalgic events
1.⁠ ⁠My favourite hangout spot at JNV: Store room; లైబ్రరీ (క్లాస్ లు మానేసి ఎప్పడు అక్కడ కూర్చునేదాన్ని, సర్ కూడా బాగా చూసుకునేవారు. లైబ్రరీ అంటే ఏదో చదువుల తల్లి అనుకునేరు, చదివేది అంత కథలు స్పోర్ట్స్ న్యూస్ లే ఎప్పడు).
అలాగే గ్రౌండ్ (సాయంత్రం ఆటలు ఆడకుండా ఫ్రెండ్స్ తో ముచ్చట్లు, కాలయాపన), 2007 క్రికెట్ వరల్డ్ కప్ కామెంటరీ రేడియో లో వినటం ఆ జ్ఞాపకాలే వేరు.

2.⁠ ⁠A day in my life at JNV Krishna: మొదట్లో ఏంటి రా బాబు ఈ నరకం లో వచ్చి పడ్డాను అని తెగ ఏడ్చాను, ఓ చాలా స్టంట్స్ కూడా చేశాను అనుకోండి బయట పడటానికి, ఏం పని చెయ్యలేదు. ఇంక కుదరదు అనుకుని అలవాటు చేసుకున్న రోజు నుండి ఒక కొత్త ప్రపంచం చూసాను. చదువు మాత్రమే కాదు జీవితాన్ని నేర్పింది నవోదయ. ఎప్పటికీ నవోదయ రుణం తీర్చుకోలేనేమో.

Community Engagement
1.⁠ ⁠My reach towards my batchmates: వీలు కుదిరినప్పుడు ఫోన్ లో మెసేజ్ ల ద్వారా మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడుకున్న ప్రతిసారి నవోదయ లో చేసిన అల్లరి పనులు అవి గుర్తు చేసుకుంటూ ఉంటాం.

2.⁠ ⁠Something about my batchmates: ఎన్నో సంవత్సరాల తర్వాత కలసిన, మాట్లాడిన ఇంతకుముందు ఎక్కడ ఆగిందో సంభాషణ మళ్లీ అక్కడి నుండి మొదలు పెట్టొచ్చు. మనల్ని మనలాగా చూసిన వాళ్ళు నవోదయం నేస్తాలు, జడ్జి చేస్తారు అనే భయం లేకుండా మాట్లాడొచ్చు.

My words towards our alumni
1.⁠ ⁠Suggestion: పెద్దగా ఏమీ లేవు, ప్రసేన్ లాంటి వారి పుణ్యమా అని ఇలా ఏ రోజు ఈ గ్రూప్ ఇంత సందడి గా ఉంది, మన వాళ్ళు ఎప్పడు ఇలానే ఉండాలి అని ఆశ .

2.⁠ ⁠⁠Feedback: మంచి పని చేస్తున్నారు, కుమ్మేసేయండి.

Share this story

Comments (0)